ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దులు బంద్​... వాహన చోదకులకు ఇబ్బందులు - updates of shutdown ap

తెలుగు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ ప్రకటించిన నేపథ్యంలో.. ఆంధ్రా తెలంగాణా సరిహద్దులు మూసివేశారు. రాష్ట్రం దాటి అత్యవసర సేవలు మినహా ఎవరూ రాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. తమను అనుమతించటంలేదని వాహనదారులు కృష్ణారావుపాలెం చెక్​పోస్ట్​ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

andhra telagana boarders bundh drivers facing problems
ఆంధ్రా- తెలంగాణా బోర్డర్లు బంద్​..

By

Published : Mar 23, 2020, 2:58 PM IST

ఆంధ్రా- తెలంగాణా బోర్డర్లు బంద్​..

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్‌ వద్ద పోలీసులకు, వాహనదారులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద చాట్రాయి సమీపంలో.. పోలీసులకు వాహన చోదకులకు నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. చాట్రాయి ఎస్ఐ శివన్నారాయణ నేతృత్వంలోని బృందం వాహన చోదకులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను వివరించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details