ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిపై సీఎస్ సమీక్ష - corona updates in krishna district

కృష్ణా జిల్లాలో కరోనా నివారణ, చికిత్స, టీకా పంపిణీపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, స్పెషల్ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లాలోని పరిస్థితులపై వివరించారు.

corona regulaition action in krishna district
corona regulaition action in krishna district

By

Published : May 11, 2021, 7:00 AM IST

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, స్పెషల్ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డిలు కృష్ణాజిల్లా అధికారులతో కొవిడ్ పై జూమ్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,394 మంది చికిత్స పొందుతున్నారని, గత రెండు వారాల్లో 4,245 మందికి హోమ్‌ ఐసొలేషను కిట్లను అందించామని, జిల్లాలో ఇప్పటి వరకు 6,66,329 మందికి టీకా వేసినట్టు కలెక్టర్ ఇంతియాజ్‌ తెలిపారు. జిల్లాలోని 76 కోవిడ్ ఆసుపత్రులలో 4,394 బెడ్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఒక్కరోజులోనే 706 మందికి హోమ్ ఐసోలెషేన్ కిట్స్ ఉచితంగా పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు . రెడ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా ప్రజలను గుర్తించే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చెయ్యడం జరుగుతున్నట్లు వివరించారు.

జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్లను తనిఖీ చేస్తున్నట్టు జేసీ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. శివశక్తి ఏజెన్సీలో తనిఖీ చేయగా, వారి నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ కోసం ప్రతిపాదన వచ్చినట్టు వివరించారు. డీఎంహెచ్‌వో డాక్టరు సుహాసినీ, డీఎల్వో డాక్టరు ఉషారాణి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టరు జ్యోతిర్మణి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !

ABOUT THE AUTHOR

...view details