అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 930 వలస కూలీలు... మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో గుంతకల్లుకు చేరుకున్నారు. వారిలో 250 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు.
కర్నూలుకు చెందిన 37మంది, కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యిందని ఆయన వివరించారు. మిగిలిన కూలీలను క్వారంటైన్‌కు తరలించామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.