High Court Employees letter to cm ys jagan: ఐఆర్ కన్నా తక్కువగా ఫిట్మెంట్ ఇవ్వటంతో ఉద్యోగస్తులు నిరాశతో ఉన్నారంటూ హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎం జగన్ కు లేఖ రాసింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక పక్కనపెట్టి ఫిట్ మెంట్ ఇవ్వటం సరికాదని .. కమిటీ నివేదికపై చర్చ జరిపిన తర్వాతే ఫిట్ మెంట్ ఇవ్వాలని సంఘం నేతలు కోరారు.
పీఆర్సీ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్ ను లేఖలో కోరారు. హెచ్ఆర్ఏ అంశంలో సైతం ఉద్యోగస్థులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఐఆర్ రికవరీ లేదంటూనే .. పదవీ విరమణ తర్వాత చెల్లించమనటం సమంజసం కాదన్నారు.