ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారు ‘మానవత్వ ధీరులు’: డీజీపీ - ఏపీలో కరోనా కేసులు

కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తుల నిస్వార్థ సేవా దృక్పథం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఆ సేవలకు గుర్తింపుగా ఏపీ పోలీసు శాఖ తరఫున వారికి ‘మానవత్వ ధీర’ పురస్కారాన్ని అందజేస్తున్నామని వివరించారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులే వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో... తాము ఉన్నామంటూ ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్న రాష్ట్రంలోని పలువురు సేవామూర్తులను వర్చువల్‌ విధానంలో శుక్రవారం డీజీపీ సత్కరించారు

Andhra pradesh DGP felicitation to NGo's
Andhra pradesh DGP felicitation to NGo's

By

Published : Jun 5, 2021, 7:35 AM IST

ఎవరూ పట్టించుకోని కరోనా మృతదేహాలకు గౌరవ ప్రదమైన పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. కష్ట కాలంలో ధైర్యంగా ముందుకొచ్చి సంప్రదాయ విధానంలో దహన సంస్కారాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆ సేవలకు గుర్తింపుగా పోలీస్ శాఖ తరఫున వారికి 'మానవత్వ ధీర' పురస్కారాన్ని అందజేస్తున్నామని వివరించారు. పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వెబినార్ ద్వారా మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్ ..ఇలాంటి సేవలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. గుంటూరు లోని అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ , విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధులను పోలీస్ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details