I am prepared to sacrifice my life: తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాలలో అరెస్టు తర్వాత ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత 45 ఏళ్లగా నిస్వార్థంగా తెలుగు ప్రజల కోసం సేవ చేస్తున్నాని వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. తెలుగు ప్రజలకు, రాష్ట్రానికి, మాతృభూమికి సేవ చేయకుండా ఈ ప్రపంచంలో నన్ను ఏ శక్తీ ఆపలేదన్నారు.
తెలుగువారి ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: చంద్రబాబు
AP CID Arrests Chandrababu naidu: చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీతోపాటు పోలీసులు అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా నంద్యాలలో హైడ్రామా నడిపించారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 I.P.C, 12, 13 (2) రెడ్ విత్ 13 (1) (C)(D) ప్రివన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైనందున.... అరెస్టు చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత... నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో ఆయన కాన్వాయ్‌లోనే గుంటూరుకు తరలిస్తున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబును తీసుకెళ్లనున్నారు.
పిచ్చోడు లండన్‌కి మంచోడు జైలుకా
పిచ్చోడు లండన్ కి... మంచోడు జైలుకా..?: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసుల హై డ్రామా సృష్టించారు. నోటీసులు అడిగితే DSP వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. లోకేష్ వద్దకు మీడియాని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్ళకూడదా అని లోకేష్ పోలీసులను నిలదీశారు. తన వెంట నాయకులు ఎవరు రావడం లేదని... కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నా అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ కి నిరసన గా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే లోకేష్ బైఠాయించి నిరసన తెలిపారు. పిచ్చోడు లండన్ కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అని దుయ్యబట్టారు. జగన్ తల కిందులుగా తపస్సు చేసినా... చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అని ఎద్దేవా చేశారు.
పిచ్చోడు లండన్‌కి మంచోడు జైలుకా
skill development case (స్కిల్ వెవలప్‌మెంట్ కేసు): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ పలు కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని పేర్కంది. జీవో నెంబర్ 4 ప్రకారం డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్, సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ కు గత ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సొమ్మును అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్ వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. 2017-2018 సంవత్సరంలో 371 కోట్ల రూపాయలలో.. దాదాపు 241 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్లు సీఐడీ పేర్కొంది. అసలు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను 3300 కోట్ల రూపాయలకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని సీమెన్స్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యతో ఏపీ ప్రభుత్వంపై ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా 371 కోట్ల రూపాయల భారం ఏర్పడింది. కానీ సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం 58 కోట్ల రూపాయలు అని బిల్లుల్లో నమోదైంది.
LIVE: నంద్యాల జిల్లాలో చంద్రబాబు అరెస్ట్.. ఉద్రిక్తత.. ప్రత్యక్షప్రసారం
చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు... జగన్ సైకో పాలనపై నిరసనలు