రానున్న రోజుల్లో అన్ని రంగాల్లోనూ రోబోల శకం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ రంగం ద్వారా విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు యూరోపియన్ మెకాట్రానిక్స్ సంస్థ అధ్యక్షుడు నాగరాజు. ఇందుకోసం రాష్ట్రంలో ఇప్పటికే పలు కళాశాలలు జర్మనీలోని మెకాట్రానిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. తాజాగా విజయవాడలోని ఆంధ్రాలయోలా ఇంజనీరింగ్ కళాశాల సైతం ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు 15 రోజుల పాటు రోబోటిక్స్ బోధనలో తర్ఫీదు పొందారు. అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. కోర్సుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 45 శాతం, మెకాట్రానిక్స్ సంస్థ 45 శాతం భరించనుంది. కేవలం 10 శాతం రుసుమును విద్యార్థులు చెల్లిస్తే సరిపోతుందని నాగరాజు తెలిపారు.
'అన్ని రంగాల్లోనూ.. రోబోల శకం - రోబోల తయారీలో మెకాట్రానిక్స్ సంస్థ తాజా వార్తలు
రోబోటిక్ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా నిరుద్యోగాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుందని యూరోపియన్ మెకాట్రానిక్స్ సంస్థ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. విజయవాడలోని ఆంధ్రాలయోలా ఇంజనీరింగ్ కళాశాలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కళాశాలకు చెందిన అధ్యాపకులు జర్మనీలో ట్రైనింగ్ తీసుకున్నారు.

విజయవాడలోని ఆంధ్రాలయోలా ఇంజనీరింగ్ కళాశాలతో సంస్థ ఒప్పందం
విజయవాడలోని ఆంధ్రాలయోలా ఇంజనీరింగ్ కళాశాలతో సంస్థ ఒప్పందం
ఇవీ చూడండి...
జాతీయ విపత్తుగా ప్రకటిస్తే..మీకేమో అంత నిర్లక్ష్యమా?
TAGGED:
రోబోల శకం తాజా వార్తలు