బెజవాడలో ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు చెట్టు నీడ కనిపిస్తే ప్రాణానికి ఎంతో హాయిగా అనిపిస్తోంది. అలాంటిది వందల చెట్లు ఒకే ప్రదేశంలో ఉంటే ఎంత చల్లగా ఉంటుందో కదా..?
విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల ప్రాంగణంలో ఉన్న పచ్చదనం అలాంటి అనుభూతినే కలిగిస్తోంది. 1953లో ఈ కళాశాల నిర్మాణం జరిగినప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలై పచ్చదనాన్ని పంచుతున్నాయి. నగరంలో నమోదైన ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇక్కడ 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది.