ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chalo Vijayawada Live Updates: 'చలో విజయవాడ'పై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అడ్డగింత

Chalo Vijayawada Live Updates
Chalo Vijayawada Live Updates

By

Published : Feb 2, 2022, 4:34 PM IST

Updated : Feb 2, 2022, 10:39 PM IST

22:29 February 02

ప.గో.: పెదవేగి మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

ప.గో.: పెదవేగి మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

21:53 February 02

ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టెక్కలి పరిధిలో 11 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

21:37 February 02

కొమరాడలో ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • కొమరాడలో ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కొత్తవలసలో ఏడుగురు ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు
  • విజయవాడకు వెళ్లకుండా బొబ్బిలిలో ఏడుగురు అరెస్టు
  • బొబ్బిలిలో యూటీఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ గౌరి గృహనిర్బంధం
    పార్వతీపురంలో 24 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    పార్వతీపురంలో ఎస్ఐ కలందర్, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం

21:36 February 02

నంద్యాల రైల్వేస్టేషన్‌లో భారీగా పోలీసుల మోహరింపు

నంద్యాల రైల్వేస్టేషన్‌లో భారీగా పోలీసుల మోహరింపు

ఉద్యోగులు రైళ్లలో విజయవాడకు వెళ్తున్నారనే సమాచారంతో పోలీసుల మకాం

శ్రీకాకుళంలో

శ్రీకాకుళం: పాలకొండ పరిధిలో ముగ్గురు ఎన్జీవో నాయకులు అరెస్టు, విడుదల

21:15 February 02

రైల్వేస్టేషన్‌లో 30 మంది ఉపాధ్యాయుల నిర్బంధం

  • తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో 30 మంది ఉపాధ్యాయుల అడ్డగింత
  • రైల్వేస్టేషన్‌లోనే ప్రత్యేక గదిలో ఉపాధ్యాయుల నిర్బంధం
  • విజయవాడకు మరో రైలెక్కుతారని నిర్బంధంలో ఉంచిన పోలీసులు

21:09 February 02

ఏ చర్య తీసుకున్నా.. తగ్గేదేలే..

  • చలో విజయవాడ' వాయిదా వేసుకోవాలని విజయవాడ సీపీ చెప్పారు: బొప్పరాజు
  • చలో విజయవాడకు అనుమతి లేదని సీపీ చెబుతున్నారు: బొప్పరాజు
  • గతంలోనే మా కార్యాచరణ ప్రకటించామని చెప్పాం: బొప్పరాజు
  • పీఆర్సీ నిరసన కార్యక్రమాల్లో ఇదీ భాగమేనని చెప్పాం: బొప్పరాజు
  • కార్యక్రమాన్ని విరమించుకోకపోతే పోలీస్‌ చర్య ఉంటుందన్నారు: బొప్పరాజు
  • ఏ చర్య తీసుకున్నా ముందుకే వెళ్తామని విజయవాడ సీపీకి చెప్పాం: బొప్పరాజు

21:04 February 02

కర్నూలు జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల అడ్డగింత

కర్నూలు జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల అడ్డగింత
చలో విజయవాడకు వెళ్లకుండా కట్టడి చేస్తున్న పోలీసులు
ఉపాధ్యాయ, ఉద్యోగుల గృహనిర్బంధాలు, అరెస్టులు
ఎమ్మిగనూరులో విజయవాడ బయల్దేరిన బస్సు పీఎస్‌కు తరలింపు
పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయులు పీఎస్‌కు తరలింపు
ఉద్యోగ, ఉపాధ్యాయులతో నిండిపోయిన పోలీస్‌స్టేషన్లు
ఆత్మకూరు వద్ద బస్సులను తనిఖీ చేస్తున్న పోలీసులు

21:02 February 02

'చలో విజయవాడ'కు ఉద్యోగులు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు

ప.గో.: 'చలో విజయవాడ'కు ఉద్యోగులు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు
ప్రతి మండల కేంద్రంలోనూ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసిన పోలీసులు
ఏలూరు రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు
పెదపాడు మం. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద హైవేపై పోలీసుల తనిఖీలు
'చలో విజయవాడ'కు ఉద్యోగులు వెళ్లరాదంటూ పోలీసుల హెచ్చరికలు
'చలో విజయవాడ'కు వెళ్లరాదని 180 మంది ఉద్యోగసంఘాల నేతలకు నోటీసులు
వివిధ మార్గాల్లో ఇప్పటికే విజయవాడ చేరుకున్న పలువురు నాయకులు

21:02 February 02

కడప: 'చలో విజయవాడ'కు వస్తున్న ఉద్యోగుల అడ్డగింత

కడప: 'చలో విజయవాడ'కు వస్తున్న ఉద్యోగుల అడ్డగింత

పలుచోట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులను గృహనిర్బంధం చేసిన పోలీసులు
జిల్లావ్యాప్తంగా 121 మంది నాయకులకు నోటీసులిచ్చిన పోలీసులు
కడప ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు

20:42 February 02

కృష్ణా: 'చలో విజయవాడ' కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు: పోలీసులు

  • కృష్ణా: 'చలో విజయవాడ' కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు: పోలీసులు
  • గుడివాడ సబ్‌ డివిజన్‌ పరిధిలోని 70 మందికిపైగా ఉద్యోగులకు నోటీసులు
  • ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ముందస్తు నోటీసులు జారీచేసిన పోలీసులు

20:38 February 02

విజయవాడకు వెళ్లకుండా ఆదోనిలో ఉద్యోగుల అరెస్టు

కర్నూలు: విజయవాడకు వెళ్లకుండా ఆదోనిలో ఉద్యోగుల అరెస్టు
ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

20:38 February 02

గుంటూరు జిల్లా పోలీసుల అప్రమత్తం

విజయవాడ వెళ్లకుండా గుంటూరు జిల్లా పోలీసుల అప్రమత్తం
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఉద్యోగులు రాకుండా కట్టడి
2 జాతీయ రహదారులు, ముఖ్యమైన మార్గాల్లో చెక్‌పోస్టులు
వినుకొండ మండలం విటంరాజుపల్లె, ఫిరంగిపురంలో చెక్‌పోస్టులు

చెన్నై-కోల్‌కతా హైవేపై యడ్లపాడు, పెదకాకాని వద్ద చెక్‌పోస్టులు
గుంటూరు జిల్లాలో వెయ్యి మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోటీసులు
ఉద్యోగసంఘాల నేతలు పలువురిని గృహనిర్బంధం చేసిన పోలీసులు

20:38 February 02

220 మంది ఉద్యోగసంఘాల నేతలకు నోటీసులు

  • ప్రకాశం: చలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు
  • ప్రకాశం జిల్లాలో 220 మంది ఉద్యోగసంఘాల నేతలకు నోటీసులు
  • ప్రకాశం: ప్రధాన రహదారుల్లో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు
  • ప్రకాశం: వాహనాలు ఇవ్వవద్దని ట్రావెల్ ఏజెన్సీలకు హెచ్చరికలు
  • ప్రకాశం: ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా విజయవాడ వెళ్లిన ఉద్యోగులు

20:01 February 02

విజయవాడ వెళ్లకుండా ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

  • విశాఖ: విజయవాడ వెళ్లకుండా ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు
  • పాడేరు నుంచి విశాఖ వచ్చిన వందలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు

19:26 February 02

విజయవాడకు వెళ్లకుండా కోవెలకుంట్లలో ఉద్యోగుల అరెస్టు

కర్నూలు: విజయవాడకు వెళ్లకుండా కోవెలకుంట్లలో ఉద్యోగుల అరెస్టు
ఉపాధ్యాయ, ఉద్యోగులను పోలీస్ స్టేషన్ కు తరలింపు

19:25 February 02

ఉరవకొండలో చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఉపాధ్యాయలు అడ్డగింత

నాయకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..

19:04 February 02

జాతీయ రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు

  • విజయవాడ మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు
    విజయవాడ-జగ్దల్‌పూర్ హైవేపై ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు
  • తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు

19:04 February 02

ఉద్యోగుల 'చలో విజయవాడ' దృష్ట్యా పోలీసుల అప్రమత్తం

ఉద్యోగుల 'చలో విజయవాడ' దృష్ట్యా పోలీసుల అప్రమత్తం

శ్రీకాకుళం జిల్లాలో విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసులు
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులను తనిఖీలు చేస్తున్న పోలీసులు
పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వేస్టేషన్ల వద్ద పోలీసుల తనిఖీలు

ప్రయాణికుల్లో ఉద్యోగులున్నారా? లేరా అని ఆరా తీస్తున్న పోలీసులు

19:04 February 02

ఉద్యోగుల చలో విజయవాడపై పోలీసుల ఆంక్షలు

ఉద్యోగుల చలో విజయవాడపై పోలీసుల ఆంక్షలు

విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఉద్యోగుల అడ్డగింత

వాహనాల తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

ఎక్కడికక్కడ ఉద్యోగసంఘాల నేతల గృహనిర్బంధం

19:03 February 02

శ్రీకాకుళం జిల్లాలో విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసులు

  • ఉద్యోగుల 'చలో విజయవాడ' దృష్ట్యా పోలీసుల అప్రమత్తం
  • శ్రీకాకుళం జిల్లాలో విస్తృత తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులను తనిఖీలు చేస్తున్న పోలీసులు
  • పలాస, సోంపేట, ఇచ్చాపురం రైల్వేస్టేషన్ల వద్ద పోలీసుల తనిఖీలు
  • ప్రయాణికుల్లో ఉద్యోగులున్నారా? లేరా అని ఆరా తీస్తున్న పోలీసులు

19:02 February 02

విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు

  • ఉద్యోగుల చలో విజయవాడపై పోలీసుల ఆంక్షలు
  • విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు
  • బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఉద్యోగుల అడ్డగింత
  • వాహనాల తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు
  • ఎక్కడికక్కడ ఉద్యోగసంఘాల నేతల గృహనిర్బంధం

18:15 February 02

కదిరి రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులను అడ్డగించిన పోలీసులు

  • అనంతపురం: కదిరి రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులను అడ్డగించిన పోలీసులు
  • రైలు వచ్చేవరకు ముళ్లకంపల్లో దాక్కున్న ఉద్యోగులు
  • రైలు ఎక్కుతున్న వందమంది ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు
  • పుట్టపర్తిలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నిరసన

17:30 February 02

ఉపాధ్యాయులు అరెస్టు

  • విజయనగరం: చలో విజయవాడకు వెళ్తున్న ఉపాధ్యాయులు అరెస్టు
    పార్వతీపురం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు

16:52 February 02

ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు

చిత్తూరు: విజయవాడ వెళ్లే ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
చిత్తూరు: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భారీగా పోలీసుల మోహరింపు
చిత్తూరు, ములకలచెరువు, కుప్పంలో ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు

16:52 February 02

గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు

నిర్బంధం 4.44 PM మురళి

కడప: ఉద్యోగులు, ఉపాధ్యాయులను గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు
పలువురు ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం

పీఎస్టీయూ, ట్రెజరీ ఉద్యోగుల సంఘం నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

16:27 February 02

ఆందోళనకు సహకరించాలని పోలీసులను కోరాం: సాధన సమితి నేతలు

మా ఆందోళనకు సహకరించాలని పోలీసులను కోరాం: సాధన సమితి నేతలు
కిందిస్థాయి పోలీసు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశాం: సాధన సమితి నేతలు

మా ఆందోళన వల్ల పోలీసులూ లబ్ధి పొందుతారు: సాధన సమితి నేతలు
యూనిఫార్మ్ సర్వీసు వల్ల పోలీసులు ఆందోళన చేయలేని పరిస్థితి: నేతలు

16:23 February 02

విజయవాడకు వచ్చే మార్గాల్లో పోలీసుల తనిఖీలు

  • విజయవాడకు వచ్చే మార్గాల్లో పోలీసుల తనిఖీలు
  • బస్సులు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
  • అన్ని జిల్లాల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసుల తనిఖీలు
  • స్టీరింగ్ కమిటీ నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు

16:23 February 02

ఉద్యమ కార్యాచరణ యథాతథం: సాధన సమితి నేతలు

ఉద్యమ కార్యాచరణ యథాతథం: సాధన సమితి నేతలు
రేపు యథావిధిగా చలో విజయవాడ: సాధన సమితి నేతలు

16:22 February 02

విజయవాడ సీపీతో ముగిసిన పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ

విజయవాడ సీపీతో ముగిసిన పీఆర్సీ సాధన సమితి నేతల భేటీ
చలో విజయవాడ, వివిధ అంశాలపై చర్చించిన సాధన సమితి నేతలు

16:22 February 02

విజయవాడ సీపీతో పీఆర్సీ సాధన సమితి నేతల సమావేశం

విజయవాడ సీపీతో పీఆర్సీ సాధన సమితి నేతల సమావేశం
చలో విజయవాడ, వివిధ అంశాలపై చర్చిస్తున్న సాధన సమితి నేతలు
సీపీ ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్లిన పీఆర్సీ సాధన సమితి నేతలు

16:18 February 02

విజయవాడలో పోలీసుల ఆంక్షలు

విజయవాడలో పోలీసుల ఆంక్షలు
రేపు చలో విజయవాడకు ప్రభుత్వ ఉద్యోగుల పిలుపు
చలో విజయవాడ ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ
రేపు బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై వాహన రాకపోకలు నిషేధించిన పోలీసులు
ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 వరకు వాహనాలకు అనుమతి లేదు: పోలీసులు
మళ్లింపు మార్గాల్లోనే వాహనదారులు వెళ్లాలని పోలీసుల ప్రకటన

Last Updated : Feb 2, 2022, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details