కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. వైకాపా నేత అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు జిల్లా నుంచి సుమారు ఆరు కేజీల మందును తీసుకొచ్చి 600 ప్యాకెట్లుగా విభజించి ప్రజలకు వితరణ చేశారు.
పంపిణీ తీరుపై విమర్శలు
కరోనా మందు ప్యాకెట్లపై స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫొటోలు ముద్రించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ పబ్లిసిటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాక.. మైలవరం పట్టణంలో సుమారు 25 వేల మంది జనాభా ఉంటే.. ఓ సెగ్మెంట్లో ఉన్న ప్రజలకు మాత్రమే మందు పంపిణీ చేయటంపై మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Pattabi: 'అమరావతిలో భూ దోపిడీ అంటూ.. మళ్లీ ఆవు కథ మొదలు'