రాష్ట్రాన్ని 3 ముక్కలుచేసి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి పంచాలనే దురుద్దేశంతోనే సీఎం జగన్ 3 రాజధానుల నాటకం ఆడుతున్నారని తెదేపా నేత అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 3 రాజధానుల నిర్ణయం రాష్ట్రాభివృద్ధి కోసం కాదని.. ముఖ్యమంత్రి స్వార్ధ ప్రయోజనాల కోసమే అని మండిపడ్డారు. సీఎం భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి సరైన రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయని.. జగన్ అసలు ఏపీకి రాజధాని ఏదో తెలియని పరిస్థితి కల్పించారని విమర్శించారు. ఏడాదిన్నర వైకాపా పాలనలో ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అమరావతికి అంతర్జాతీయ బ్రాండ్ క్రియేట్ చేసి వేలకోట్ల పెట్టుబడులు తెస్తే.. నేడు జగన్ ఆ బ్రాండ్‌ని నాశనం చేసి ఆంధ్రప్రదేశ్‌ను అగాధంలోకి నెట్టారని దుయ్యబట్టారు.