కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో.. ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో సహా తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్న కుమారుడు మృతి చెందగా.. పెద్దకుమారుడు శంకర్, తల్లి అంకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వీరిని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య కారణాల వల్ల పురుగుల మందు తాగి చనిపోదామనుకున్న మహిళ.. తన ఇద్దరు పిల్లలు అనాధలౌతారని వాళ్లకీ విషం తాగించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అంకమ్మకు ఆర్థికంగా, కుటుంబ ఇబ్బందులు లేనప్పటికి ఇలా ఆత్మహత్య యత్నానికి పాల్పడటంపై గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: పిల్లలకు విషమిచ్చింది...తానూ తాగింది - mother and sons suiide attempt in gannavaram
తాను చనిపోతే పిల్లలు అనాధలవుతారనే ఉద్దేశంతో ఓ మహిళ తనతో పాటు ఇద్దరు కుమారులకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. చిన్న కుమారుడు మృతి, మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది
విషాదం: పిల్లలకు విషమిచ్చింది...తానూ తాగింది