లాక్ డౌన్ కారణంగా విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. చేతిలో డబ్బులు లేక, చేసేందుకు పనిలేకపోవడంతో వీరంతా ఆటోనగర్‌లోనే చెట్లకింద కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా పనిలేక పస్తులుంటున్న వారికి అమృత క్యాటరింగ్ సంస్థ యజమాని సుబ్బారావు, ఆయన మిత్ర బృందంతో కలిసి భోజనం అందిస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి రోజు వారిగా మిత్ర బృందంలోని సభ్యులే నిరాశ్రయులకు ఆహారం పెడుతున్నారు.
అమృత క్యాటరింగ్ సంస్థ వితరణ - krishna distrct
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వలస కూలీల ఆకలి తీర్చేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. అమృత క్యాటరింగ్ సంస్థ ఆటోనగర్‌లోని నాలుగు కూడళ్లలో ఉంటున్న సుమారు 700 మందికి నిత్యం భౌతిక దూరం పాటిస్తూ భోజనాలు పెడుతున్నారు.
అమృత క్యాటరింగ్ సంస్థ వితరణ
లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాతి నుంచి వీరు నిర్విఘ్నంగా నిత్యం భోజనం అందిస్తున్నారు.
ఇది చదవండి'ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచట్లేదు'