విజయవాడలో ఆధునిక నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం సవరించిన అంచనాలకు పురపాలక శాఖ అనుమతి లభించింది. పాత నీటి పైప్‌లైన్ వ్యవస్థ స్థానంలో కొత్త పైప్‌లైన్‌ల ఏర్పాటు, సెన్సార్ల ఏర్పాటుకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు జారీ చేసింది.
విజయవాడ పరిధిలో అమృత్ పథకం నిధులు విడుదల - విజయవాడకు అమృత్ పథకం ద్వారా నిధులు విడుదల
విజయవాడలో పలు అభివృద్ధి పనులకు అమృత్ పథకం కింద నిధులు విడుదల అయ్యాయి. నూతన పైపులైన్ల ఏర్పాటు, సెన్సార్ల ఏర్పాటుకు సవరించిన అంచనాలకు పురపాలక శాఖ అనుమతి లభించింది.
విజయవాడ పరిధిలో అమృత్ పథకం నిధులు విడుదల
విజయవాడ పరిధిలో అమృత్ పథకం కింద నిధుల విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్రం వాటాగా రూ.24 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.14.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. పట్టణాల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.57.24 కోట్లు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటాగా రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి.