ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన అంబులెన్స్.. ముగ్గురికి గాయాలు - గన్నవరంలో డివైడర్​ను ఢీకొట్టిన అంబులెన్స్

గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తుండగా.. అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ambulance accident
ambulance accident

By

Published : Jun 20, 2020, 11:27 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబులెన్స్ వేగంగా వెళుతూ అదుపు తప్పింది. డివైడర్​ను బలంగా ఢీకొట్టడంతో.. అంబులెన్స్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇచ్చాపురంకి చెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్​లో స్వస్ధలానికి తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాపడ్డ ముగ్గురిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details