ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో అంబేడ్కర్ సిద్ధాంత అవగాహన తరగతులు - కృష్టా జిల్లా తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో యువతలో అంబేడ్కర్​ భావాలను కలిగించడానికే అంబేడ్కర్ సిద్ధాంత తరగతులని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024లో యువత రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు.

ambedkar classes in vijayawada
విజయవాడలో అంబేడ్కర్ సిద్ధాంత అవగాహన తరగతులు

By

Published : Jan 23, 2021, 10:47 PM IST

జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సిద్ధాంత అవగాహన తరగతి కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. తాము ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకమని.. జగన్ మోహన్ రెడ్డికి కాదని ఆయన స్పష్టం చేశారు.

అంబేడ్కర్ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ఆంధ్రప్రదేశ్​లో యువతలో అంబేడ్కర్​ భావాలను కలిగించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీని ద్వారా రాజ్యాధికారం సాధించాలని రాష్ట్రంలో 20 నుండి 35 సంవత్సరాల వయస్సు మధ్య గల యువతను 2 లక్షల మందిని అంబేడ్కర్ వాదులుగా తయారు చేయాలనే లక్ష్యంతో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024లో యువత రాజ్యాధికారం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details