రాజధాని అమరావతిని తెదేపా నేతలు భ్రమరావతిని చేశారని వైకాపా ఆరోపించింది. గ్రాఫిక్స్ నమూనాలు, ఫొటోలు చూపించి అమరావతి పేరిట అద్భుత నగరం నిర్మిస్తున్నట్లు విస్తృత ప్రచారం చేశారని చివరకు చేసిందేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఐదేళ్లలో 9 వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి రాజధానిలో ఏం నిర్మించారో తెదేపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఊహాత్మక బొమ్మలు చూపించి అద్భుతమైన రాజధాని నిర్మించారని ప్రచారం చేస్తూ అందరినీ మోసం చేశారని అన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.12 వేలు ఖర్చుపెట్చి దోచుకున్నారని ఆరోపించారు. 5ఏళ్లలో రాాజధానిపై కనీసం నోటిఫికేషన్ ఇవ్వలేదని.. రాజధానిని ఓ ఆదాయ వనరు, రియల్ ఎస్టేట్లాగా వాడుకున్నారని ధ్వజమెత్తారు.
'రాజధాని అమరావతిని ... భ్రమరావతిని చేశారు'
రాజధాని నిర్మాణంపై గత ప్రభుత్వ చర్యలపై వైకాపా నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతిని ఓ ఆదాయ వనరు, రియల్ ఎస్టేట్లాగా వాడుకున్నారని ఆరోపించారు.
వైకాాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Last Updated : Nov 6, 2019, 11:55 PM IST