బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో విజయవాడలో అమరావతి ఫుడ్స్ అండ్ సూపర్ మార్ట్ పేరుతో మొబైల్ మార్ట్‌ను ప్రారంభించారు. నగరంలో కరోనా బాధితులు నివాసముంటున్న ప్రాంతాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడంతో అక్కడ నివాసముంటున్న వారిని బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలు నిత్యావసర సరకులు, ఇతర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నందున ఈ సంచార దుకాణాలను ఏర్పాటు చేశామని ఆ సంస్ధ నిర్వాహకులు తెలిపారు.
విజయవాడలో అమరావతి ఫుడ్స్ అండ్ సూపర్ మార్ట్ - corona effected area in vijayawada
విజయవాడ నగరంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను అధికారులు కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాలలో నివాసముంటున్న వారు బయటకు రాకుండా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడానికి అమరావతి ఫుడ్స్ అండ్ సూపర్ మార్ట్ అనే సంచార వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
విజయవాడలో అమరావతి ఫుడ్స్ అండ్ సూపర్ మార్ట్