అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 251వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని పరిరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఐకాసను 175 నియోజకవర్గాల్లోకి విస్తరిస్తామని రైతులు స్పష్టం చేశారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, మందడం, తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్ధండరాయునిపాలెం, అబ్బిరాజుపాలెంలో రైతులు నిరసనలు తెలియజేశారు. తుళ్లూరులో మహిళలు నాగలికి పూజలు చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో రైతుల ధర్నాకు మద్దతుగా అమరావతి, రాజధాని ఐకాస నేతలు పాల్గొన్నారు. ఉద్ధండరాయుని పాలెం రైతులకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
'ఐకాసను 175 నియోజకవర్గాల్లో విస్తరిస్తాం'
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు 251వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని పరిరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఐకాసను 175 నియోజకవర్గాల్లోకి విస్తరిస్తామని రైతులు స్పష్టం చేశారు.
అమరావతి రైతుల ధర్నా
వెలగపూడిలో రైతుల దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరి ఐకాస నేత మనోహర్ నాయుడు సంఘీభావం ప్రకటించారు. ఇక్కడి రైతుల దీక్షను స్ఫూర్తిగా తీసుకొని కదిరి నియోజకవర్గంలోనూ ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువతి బలవన్మరణం