కృష్ణా జిల్లా నూజివీడు పట్టణం బస్టాండ్ రోడ్డులో ఏర్పాటు చేసిన అమరావతి బ్యాంక్, పేదలు మధ్య తరగతి వర్గాల నుంచి కోట్లాది రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించింది. విజయవాడ, నూజివీడు, విసన్నపేట, తిరువూరులలో బ్రాంచీలు ప్రారంభించి డిపాజిట్ల సేకరణ ముమ్మరం చేసింది. గడువు తీరినప్పటికీ నగదు చెల్లించకపోవడంతో ఖాతాదారులు వచ్చి అమరావతి బ్యాంకుకు తాళం వేశారు.
నూజివీడు: బోర్డు తిప్పేసిన అమరావతి బ్యాంక్ - Amaravati Bank
కృష్ణా జిల్లా నూజివీడులో అమరావతి బ్యాంక్ బోర్డు తిప్పేసింది. 18 నెలల కిందట ప్రారంభమైన అమరావతి బ్యాంక్... విజయవాడ, నూజివీడు, విస్సన్నపేట, తిరువూరులలో శాఖలు ప్రారంభించింది. బ్యాంక్ ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
డిపాజిట్లు తిరిగి చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఫిబ్రవరి 28న అందరికీ డబ్బు చెల్లిస్తామని బ్యాంకు అధికారులు బాండ్ రాశారని బాధితులు చెబుతున్నారు. ఆ గడువు మూడుసార్లు వాయిదా పడినప్పటికీ ఒక్కపైసా చెల్లించలేదని ఖాతాదారులు వాపోతున్నారు. కూలి పనులు, చిన్నచిన్న వ్యాపారాలతో పోగుచేసిన డబ్బు డిపాజిట్ చేస్తే.. పేదలను మోసం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టిన డిపాజిట్ సొమ్ము అందించాలని, మోసం చేసిన బ్యాంకు వారిని కఠినంగా శిక్షించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండీ... పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం