ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్న ప్రకటన వచ్చే వరకూ ఉద్యమం విరమించేది లేదని రాజధాని మహిళలు తేల్చి చెప్పారు. తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుతో ఏటా ఇళ్లలో నిర్వహించుకునే శ్రావణ శుక్రవారం పూజలను ఈ ఏడాది దీక్షా శిబిరాల్లో జరుపుకొనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే శ్రావణ శుక్రవారం నాటికి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత శుక్రవారం గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం చేశారని.. వారంలోపే బిల్లుపై స్టే వచ్చిందని.., మళ్లీ వచ్చే శ్రావణ శుక్రవారం లోపు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందనే ప్రకటన వస్తుందని మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు.
'వచ్చే శ్రావణ శుక్రవారంలోపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి' - అమరావతి ఉద్యమంపై వార్తలు
వచ్చే శ్రావణ శుక్రవారం నాటికి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని స్థానిక మహిళలు కోరారు. ప్రభుత్వ తీరుతో ఏటా ఇళ్లలో నిర్వహించుకునే శ్రావణ శుక్రవారం పూజలను ఈ ఏడాది దీక్షా శిబిరాల్లో జరుపుకొనే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి మహిళల ఉద్యమం