అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అమరావతి పరిరక్షణ ఐకాస మహిళా ప్రతినిధులు అన్నారు. రాజధానికి మద్దతుగా విజయవాడలోని అమరావతి ఐకాస కార్యాలయంలో నిరాహార దీక్షలు చేపట్టారు. గవర్నర్ వద్దకు చేరిన సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లును ఆమోదించవద్దని కోరారు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భూములిచ్చి వేల మంది రైతులు బాధపడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు.
'అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. అర్ధం చేసుకోండి' - విజయవాడలో అమరావతి దీక్షలు
అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అమరావతి పరిరక్షణ ఐకాస మహిళా ప్రతినిధులు అన్నారు. గవర్నర్ వద్దకు చేరిన సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లును ఆమోదించవద్దని కోరారు. రాజధానికి మద్దతుగా విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టారు.
విజయవాడలో అమరావతి దీక్షలు