ఈ నెల 22న విజయవాడలో 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు నిర్వహిస్తున్నట్లు అమరావతి రన్నర్స్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. విజయవాడను ప్లాస్టిక్‌రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. 'ప్రకృతిని రక్షిద్దాం- ప్లాస్టిక్‌ను దూరం చేద్దాం' నినాదంతో అమరావతి రన్నర్స్ పరుగు నిర్వహించడాన్ని కలెక్టరు అభినందించారు. ఇప్పటికే ఈ పరుగులో పాల్గొనేందుకు ఆన్లైన్లో వెయ్యి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఆరోగ్యం, ఆనందంపై అందరిలోనూ అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్నట్లు అమరావతి రన్నర్స్ అధ్యక్షుడు రమేష్ తెలిపారు.
'పరుగెత్తుదాం...ప్లాస్టిక్‌ను దూరం చేద్దాం రండి' - విజయవాడ నగరాన్ని ఫ్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు 10కె రన్
విజయవాడ నగరాన్ని ఫ్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు..ఈ నెల 22న 10కె రన్ నిర్వహిస్తున్నట్లు అమరావతి రన్నర్స్ నిర్వహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రచారచిత్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆవిష్కరించారు.
10కె రన్ ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్న కలెక్టర్ ఇంతియాజ్