ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలి: రైతులు - మందడంలో అమరావతి రైతుల ఆందోళనమందడంలో అమరావతి రైతుల ఆందోళన వార్తలు

మందడం గ్రామంలో 234వ రోజు అమరావతి రైతులు నిరసన దీక్ష కొనసాగించారు. అమరావతి ఎక్కడికీ వెళ్లదంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్న నాయకులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

amaravathi protest in mandadam
అమరావతి రైతుల ధర్నా

By

Published : Aug 7, 2020, 3:13 PM IST

మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరంలో కూర్చుని అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు అమరావతి అంగుళం కూడా కదలదంటూ హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడేమయ్యారంటూ రైతన్నలు ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు.. నేతలకు తమ తరఫు నుంచి బహుమతిగా గాజులు, చీర, పూలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి నాయకుల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details