ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2019, 3:01 PM IST

ETV Bharat / state

విజయవాడలో ఘనంగా బహుభాషా కవి సమ్మేళనం

విజయవాడలో బహుభాషా సమ్మేళనం ఘనంగా జరిగింది. కవితాఝరితో సృజనకు పట్టం కట్టాలనే సంకల్పంతో గత ఐదేళ్లుగా ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రాంతాలు, దేశాలకు చెందిన కవులు తమ ప్రాంతీయ భాషల్లోని కవితలను చదివి వినిపించారు.

విజయవాడలో ఘనంగా ముగిసిన బహుభాషా కవి సమ్మేళనం
విజయవాడలో ఘనంగా ముగిసిన బహుభాషా కవి సమ్మేళనం

ముగిసిన బహుభాషా కవి సమ్మేళనం

విజయవాడ నోవాటెల్‌ హోటల్​లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘అమరావతి పొయెటిక్‌ ప్రిజమ్‌’ కార్యక్రమం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలకు చెందిన 761 మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 125 భాషల్లో 1,303 కవితలను చదివి వినిపించారు. సృజనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఏటా దీనిని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కవి సమ్మేళనానికి పెద్ద ఎత్తున కవులు హాజరయ్యేలా కల్చరల్​ సెంటర్​ గౌరవ సలహాదారు పద్మజా అయ్యంగార్​, సెంటర్​ సీఈవో డాక్టర్​ ఈమని శివనాగిరెడ్డి ముఖ్యపాత్ర పోషించారని కల్చరల్‌ సొసైటీ ఛైర్మన్‌ హరిశ్చంద్రప్రసాద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details