ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సానుకూల నిర్ణయం వచ్చే వరకూ పోరాడతాం' - అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఉద్యమ కార్యాచరణ

అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి.. రాజధాని ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపింది.

amaravathi-parirakshna-samithi-action-plan
amaravathi-parirakshna-samithi-action-plan

By

Published : Jan 2, 2020, 9:34 AM IST

'సానుకూల నిర్ణయం వచ్చే వరకూ పోరాడతాం'

రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకూ ప్రజలతో కలిసి పోరాటం చేస్తూనే ఉంటామని అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. రాజధాని సాధనపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో చేపట్టనున్న కార్యక్రమాలను ఐకాస ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో భాగంగా మూడో తేదీన అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. నాలుగో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఐదో తేదీన ఐకాసలు ఏర్పాటైన జిల్లాల్లో మానవహారం చేపట్టి తమ స్వరం వినిపించనున్నారు. ఆరో తేదీన తహశీల్దారు, ఆర్డీవోలకు వినతిపత్రాలు ఇస్తారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటైందని తెలిపిన ఐకాస సభ్యులు... ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details