రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో... ప్రజలకు వ్యతిరేకంగా వాదించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులు, మహిళలను మంత్రివర్గ సమావేశం పేరిట పోలీసులు అడ్డుకోవడం దారుణమని పరిరక్షణ సమితి నేతలు అన్నారు. అమరావతి పోరాటం ఆదివారానికి 250వ రోజుకు చేరుతుండడంతో అన్ని పార్టీలతో కలిసి 'రాజ్యాంగాన్ని గౌరవిద్దాం... అమరావతిని కాపాడుకుందాం' నినాదంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు.
'ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం మూడు రాజధానుల ప్రకటన' - ఏపీ మూడు రాజధానుల ఇష్యూ
ప్రజాధనంతో ప్రజలకు వ్యతిరేకంగా వాదించేందుకు ప్రభుత్వం న్యాయవాదులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అమరావతి పరిరక్షణ సమితి ఆరోపించింది. మంత్రివర్గ సమావేశం ఉందని శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని అడ్డుకోవడాన్ని అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఖండించారు. అమరావతి పోరాటం ఆదివారానికి 250వ రోజుకు చేరుతుండడంతో అన్ని పార్టీలతో కలిసి 'రాజ్యాంగాన్ని గౌరవిద్దాం..అమరావతిని కాపాడుకుందాం' అనే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నేతలు తెలిపారు.
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రైతులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని... ప్రజలకు కష్టం వస్తే అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ... ఈ విషయంలో ఎందుకు న్యాయపోరాటం చేయడంలేదని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో యధావిధి స్థాయి ఆదేశాలు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మూడు రాజధానులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ప్రజలను రెచ్చ గొట్టడమేనన్నారు.
ఇదీ చదవండి :హార్లీడేవిడ్సన్పై స్వారీ..గుర్రంపై సవారీ.. ఖజనా ఉద్యోగి విలాసం....!