అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాల్లో చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు మార్చినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖలో తలపెట్టిన మెట్రో ప్రాజెక్టుకు కూడా అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుగా పేరు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరు మార్పు - metro rail amaravathi
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైలు కార్పోరేషన్ పేరును మార్పు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
![అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరు మార్పు Amaravathi Metro Rail corporation name changed as Andhra Pradesh Metro Rail corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6967453-265-6967453-1588008758356.jpg)
అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరు మార్పు