అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకుకర్ణాటక నుంచి వచ్చిన రైతులను పోలీసులు నిర్భంధించడం అమానుషమని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంక్షలు , అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఏకంగా శాసన మండలినే రద్దు చేయడానికి సిద్ధపడటం సీఎం జగన్ అధికార దురంహకారానికి అద్దం పడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు.
మండలి రద్దును వ్యతిరేకిస్తూ... జేఏసీ ఆందోళనలు - రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు వార్తలు
శాసన మండలి రద్దుని నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. తెనాలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమతో కలిసివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
జేఏసీ ఆందోళనలు