రాజధాని పరిరక్షణ కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు జోలె పట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస నేతలతో కలిసి విరాళాలు సేకరించారు. కోనేరు సెంటర్ నుంచి బస్ స్టాండ్ వరకు అఖిలపక్షం నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రజలు, వ్యాపారస్తులు బాబుకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. రాజధానిగా అమరావతినే ఎందుకు కొనసాగించాలో వివరించే దిశగా.. అమరావతి పరిరక్షణ కమిటీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో ఇలా విరాళాలు సేకరించారు.
రాజధాని ఉద్యమానికి జోలె పట్టిన చంద్రబాబు - . three capitals andhrapradesh
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐకాస నేతలతో కలిసి రాజధాని ఉద్యమం కోసం జోలె పట్టారు.
రాజధాని ఉద్యామానికి జోలె పట్టిన చంద్రబాబు