విజయవాడ గోకరాజు గంగరాజు అతిథి గృహం వద్ద అమరావతి రైతులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రితో భేటి అవ్వడానికి సినీ ప్రముఖులను వచ్చారని తెలిసి నిరసనకు దిగారు.
రాజధానిని కాపాడాలంటూ సినీప్రముఖులను వేడుకున్నారు. 175 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని.. తమ నిరసనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అతిథిగృహంలోకి వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.