కృష్ణా జిల్లా కంచికచర్లలోని ఓ పెళ్లి వేడుకలో రాజధాని రైతులు తమ నిరసనలు తెలియజేశారు. మల్లెల వారి వివాహ వేడుకలో జై అమరావతి, మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానిపై తమ వైఖరిని పెళ్లిలో సైతం తెలియజేయడంతో వరుడు సురేష్.. వధువు దేదీప్య సైతం రాజధానికి మద్దతు తెలిపారు. వధూవరులను రాజధాని రైతులు ఆశీర్వదించారు.
పెళ్లి వేడుకలోనూ రాజధాని రైతుల నిరసనలు - కంచికచర్ల పెళ్లిలో రాజధాని రైతుల నిరసనలు
ఓ పెళ్లి వేడుకలో రాజధాని రైతులు తమ నిరసనలు తెలిపారు. ఒక రాజధాని ముద్దు.. మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు. వధూవరులు సైతం రాజధానికి మద్దతునిచ్చారు.
పెళ్లి వేడుకలో.. రాజధాని రైతుల నిరసనలు