కృష్ణాజిల్లా నూజివీడులో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న జి ప్లస్ త్రీ భవనాల్లో పేదలకు వెంటనే ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలకు నివేశన స్థలాల పట్టాల పంపిణీ పండుగనాడు నిర్వహిస్తున్నామని ఆశ చూపి... మూడు పర్యాయాలు వాయిదా వేసి చతికిలపడ్డ జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయి చందంగా మారిందన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జీ ప్లస్ త్రీ నిర్మాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఒక్క ఇటుక కూడా పేర్చలేదని దుయ్యబట్టారు. నిర్మాణాలు పూర్తయి ఉంటే 5000 మంది లబ్ధిదారులకు జీ ప్లస్ త్రీలో ఈ పాటికే పంపిణీ జరిగేదని అన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పేదలకు పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూములు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ధ్వజమెత్తారు.