గుడివాడలో అఖిలపక్ష సమావేశం రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లా గుడివాడలో 'సేవ్ అమరావతి' పేరుతో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో... భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీల నేతలు పాల్గొన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, 29 గ్రామాల రైతులకు అన్యాయం చేయొద్దని కోరారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. ఏ ఆందోళనకైనా సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :