ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నివాసయోగ్యమైన స్థలాలు ఇవ్వండి' - avanigadda all party leaders petition

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన భూములు నివాసయోగ్యంగా లేవంటూ అఖిలపక్ష నాయకులు కృష్ణా జిల్లా అవనిగడ్డలో తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

all party leaders petition to mro on lands distribution
అఖిలపక్ష నాయకులు

By

Published : Jun 8, 2020, 7:30 PM IST

నివాసయోగ్యమైన స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో అఖిలపక్ష నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన భూములు శ్మశానానికి దగ్గరలోనూ... ముంపు ప్రాంతాల్లోనూ ఉన్నాయని వారు ఆరోపించారు.

నివాసానికి అనువైన ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారుల మీదే ఉంటుందని... లబ్ధిదారుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తహసీల్దార్​కు నేతలు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details