విద్యుత్ సంస్కరణలు- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకంపై విజయవాడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష పార్టీ నేతలు, రైతు సంఘాలు చర్చా వేదిక నిర్వహించారు. నాడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని రాజధాని ప్రాంత రైతులను మోసం చేసి.. నేడు ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ పథకంతో మరోసారి రాష్ట్ర రైతులు జగన్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి వడ్డే షోనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ పేరిట జగన్ తప్పు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నగదు బదిలీ పథకంపై సీఎంకు అవగాహన లేదన్నారు. ఓట్లు వేశారు కదా అని.. ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారులే అని జగన్ అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తామన్నారనీ.. వంచింది లేదు, తెచ్చింది లేదని ఎద్దేవా చేశారు. జీవో 22ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న శ్రీకాకుళం జిల్లా నుంచే ఉద్యమం మెుదలు పెడతామని హెచ్చరించారు.
'సిక్కోలు గడ్డ నుంచే విద్యుత్ ఉద్యమం మొదలు' - అఖిలపక్ష నేతల సమావేశం న్యూస్
నాడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పి రాజధాని ప్రాంత రైతులను మోసం చేసి.. ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ పథకంతో మరోసారి రాష్ట్రంలోని రైతులను జగన్ మోసం చేస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు.
అఖిలపక్ష నేతల చర్చ