కరోనా విలయతాండవంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని, యుద్ధప్రాతిపదికన అక్సిజన్, వాక్సిన్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కొవిడ్ నియంత్రణపై అన్ని పార్టీలతో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ఈ విపత్కర సమయంలో గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యంపై సమీక్షలు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణే లక్ష్యంగా, సింగిల్ అజెండాతో ప్రభుత్వం ముందుకెళ్లాలని హితవు పలికారు. కరోనా మహమ్మారి రెండో దశ కట్టడి, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీపీఐ అఖిలపక్ష సమావేశాన్ని విజయవాడలో నిర్వహించింది.
'కరోనా విజృంభిస్తుంటే.. ఇంటర్నెట్పై సమీక్షలా..?' - విజయవాడ తాజా వార్తలు
రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తుంటే... గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యంపై సమీక్షలు ఏంటని అఖిలపక్ష నేతలు ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నివారణ చర్యలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అకిల పక్ష నేతల సమావేశం