mayilavaram: కృష్ణా జిల్లా మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. బలవంతంగా దుకాణాలు మూయించాలని చూస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మైలవరంలో బంద్‌లో పాల్గొనేందుకు.. గొల్లపూడిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి వద్దే ఆయనను నిలిపివేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.