కళాశాలల సమీపంలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయవాడ దాసరి భవన్ వద్ద అఖిల భారత యువజన సమాఖ్య నిరసన చేపట్టింది. దీనిపై పలు కళాశాల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని నగర కార్యదర్శి మోయినుద్దీన్ తెలిపారు. మత్తు పదార్ధాలను కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
'మాదకద్రవ్యాల అలవాటు.. విద్యార్థుల భవిష్యత్తుకు చేటు' - యువత భవిష్యత్తు నాశనం
విజయవాడలో అఖిల భారత యువజన సమాఖ్య నిరసన చేపట్టింది. విద్యార్థులకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలల సమీపంలో నిఘా పెంచాలని కోరారు.
విద్యార్థుల జీవితాలపై వేటు