రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.22ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ విజయవాడలో సమావేశమయ్యింది. ఉచిత విద్యుత్ పథకానికి బదులుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
'జీవో నెం.22ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' - నగదు బదిలీ పథకం న్యూస్
ఉచిత విద్యుత్ పథకం స్థానంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జీవో నెం.22ను ఉపసంహరించుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష కో-ఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేసింది.
!['జీవో నెం.22ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' all india kisan sanghrsha coordination committee meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8808316-821-8808316-1600164051060.jpg)
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన రైతు సంఘాల నాయకులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లుతో పాటు ఇతర బిల్లులతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకించాయనీ.. కానీ కేంద్రం ఈ బిల్లును చట్టం చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కి తూట్లు పొడిచే నిర్ణయాన్ని తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై భారం పడే జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఆశ చూపి డబ్బు వసూలు చేశారు...అడిగితే ముఖం చాటేశారు!