కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. నందిగామ డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన... జిల్లాలో సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన మచిలీపట్నం కార్పొరేషన్, నందిగామ నగర పంచాయతీ ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
'అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం'
కృష్ణా జిల్లాలో పురపాలక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల భద్రత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు