ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్చరిక: రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు - కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలోనూ ఉరుములు

రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లోని చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడనున్నట్లు స్పష్టం చేసింది.

హెచ్చరిక : రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు
హెచ్చరిక : రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు

By

Published : Sep 25, 2020, 5:40 PM IST

రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేశారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలోనూ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.

మోస్తరు వర్షం..

విజయనగరం, చిత్తూరు, గుంటూరులలో మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు సెంటీమీటర్లలో పెద్దాపురం - 7.9 , కాకినాడ -5.7 , పిఠాపురం - 5.5, పెంటపాడు - 4.5, నగరి -3.7, సూళ్లురు పేట - 3.2, సాలూరు - 2.9, మంగళగిరి - 2.3, తణుకు - 2.1గా నమోదైంది.

ఉష్ణోగ్రతల వివరాలు..

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు విజయవాడ- 39, విశాఖపట్నం - 34 , తిరుపతి -38, అమరావతి -38, విజయనగరం -35, నెల్లూరు -38, గుంటూరు - 41, శ్రీకాకుళం -34, కర్నూలు - 32, ఒంగోలు - 38, ఏలూరు -38, కడప - 35, రాజమహేంద్రవరం 38, కాకినాడ -35, అనంతపురం -34 డిగ్రీల సెల్సియస్​గా రికార్డు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి : 'సీమ పౌరుషం ఉంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి'

ABOUT THE AUTHOR

...view details