కృష్ణా జిల్లా గొల్లపూడి సెంటర్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్ వేషంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న యువకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉబర్ ఈట్స్ సంస్థ బ్యాగు, ద్విచక్రవాహనంతో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ అనే యువకుడిని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద భవానీపురం సీఐ మోహన్ రెడ్డి తనిఖీ చేశారు. అతని నుంచి 86 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఫుడ్ డెలివరీ బాయ్ వేషంలో మద్యం అక్రమ రవాణా - Alcohol trafficking in Food Delivery Boy at bhavanipuram
ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరి బాయ్ వేషంలో.. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న యువకుడిని చాకచక్యంగా పట్టుకున్నారు భవానీపురం పోలీసులు.

మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు