రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడం అక్రమదారులకు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామల నుంచి మధ్యం అక్రమ రవాణా లాభసాటి వ్యాపారంగా మారింది. మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. దీంతో ఏపీ ఎక్సైజ్ శాఖ, ఏస్ఈభీ, పోలీస్ శాఖ మూకుమ్మడిగా దాడులు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
బెండకాయల మాటున మద్యం అక్రమ రవాణా - liquor smuggling latest news update
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా మారారు తెలంగాణ లిక్కర్ అక్రమ రవాణా దారులు. రాష్ట్రంలో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటిని తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు గ్రామాలు వారధిగా మారాయి.
బెండకాయల మాటున మద్యం అక్రమ రవాణా
తెంలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఒకటైన విస్సన్నపేట మండలంలోకి బెండకాయల సంచిలో మధ్యం బాటిళ్ళను దాచిపెట్టి రాష్ట్రంలోకి తీసుకొస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వందకు పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏ మార్గంలో అయినా ఇలా మద్యం అక్రమ రవాణాకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి...