ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడియో: సిలిండర్​లో 100 మద్యం సీసాలు... అవాక్కైన పోలీసులు - Alcohol smuggling in ap

మద్యం అక్రమ రవాణా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మాఫియా మాత్రం అక్రమ రవాణాకు కొత్త దారులు వెదుకుతోంది. పోలీసుల కళ్లు కప్పి పొరుగు మద్యాన్ని రాష్ట్రంలోకి తెచ్చేందుకు కొత్త పద్ధతులు ఎంచుకుంటోంది. 100 మద్యం సీసాలను గ్యాస్ సిలిండర్​లో పెట్టి తీసుకొస్తున్న వారే ఇందుకు నిదర్శనం కాగా.. వారి కదలికలను పసిగట్టిన పోలీసులు.. గుట్టు రట్టు చేశారు.

Alcohol smuggling in a gas cylinder in krishna district
Alcohol smuggling in a gas cylinder in krishna district

By

Published : Aug 22, 2020, 4:30 PM IST

గ్యాస్ సిలిండర్​లో 100 మద్యం సీసాలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు జిల్లాలోని చందర్లపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

గ్యాస్ సిలిండర్​లో పెట్టి..

నిందితులు మద్యం రవాణాకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. గ్యాస్ సిలిండర్​లో 100 మద్యం సీసాలు పెట్టి రాష్ట్రంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. వత్సవాయి చెక్​పోస్ట్​ వద్ద పోలీసులకు అనుమానం వచ్చి సిలిండర్​ను తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు వత్సవాయి ఎస్​ఐ సోమేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు

ABOUT THE AUTHOR

...view details