తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత - Alcohol abuse on telangana border krishna district
కృష్ణాజిల్లా వీరులపాడులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 46 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
![తెలంగాణ సరిహద్దులో మద్యం పట్టివేత Alcohol abuse on the krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7251633-512-7251633-1589811477458.jpg)
సీజ్ చేసిన మద్యం బాటిళ్లు
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం తెలంగాణ సరిహద్దు గ్రామాలైనా పెద్దాపురం, జయంతి, దొడ్డదేవరపాడు, పల్లంపల్లి, పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 46 మద్యం సీసాలను, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కారును సీజ్ చేసినట్లు నందిగామ రూరల్ సీఐ సతీశ్ తెలిపారు.