ప్రజలకు చేసిన దానికి జగన్ రెడ్డి పుస్తకం విడుదల చేస్తే.. మరీ ప్రజల నుంచి దోచింది, వృథా చేసిన దానికి గ్రంథాలు విడుదల చేయాలేమోనని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. ఏం సాధించారని వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. బ్లూ మీడియాను అడ్డం పెట్టుకొని మసిపూసి మారేడుకాయ చేయడంలో వైకాపా నేతలు సిద్ధహస్తులని వ్యాఖ్యానించారు.
'పబ్జీ ఆడుకోవడం తప్పా జగన్‌కి ఏమీ చేతకాదు..!' - సీఎం జగన్‌పై ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు
వైకాపా చేసిన సంక్షేమం కంటే జరిగిన అన్యాయం, దోపిడీ పదింతలు అయ్యిందని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజల నుంచి దోచింది, వృథా చేసిన దానికి గ్రంథాలు విడుదల చేయాలేమోనని ఆయన ఎద్దేవా చేశారు.
!['పబ్జీ ఆడుకోవడం తప్పా జగన్‌కి ఏమీ చేతకాదు..!' alapati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-alapati-3005newsroom-1622365691-371.jpg)
తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
తెదేపా ప్రభుత్వం 6 లక్షల కోట్ల స్కాం చేసిందని నాడు అబద్దపు పుస్తకాలు అచ్చువేశారని… రెండేళ్లైనా 6 రూపాయల అవినీతిని కూడా పట్టుకోలేకపోయారని అన్నారు. వైకాపా చేసిన సంక్షేమం కంటే జరిగిన అన్యాయం, దోపిడీ పదింతలు అయిందని మండిపడ్డారు. అభివృద్ధి, సృష్టించిన సంపద ఏంటో చెప్పే దమ్ము వైకాపా నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. ఆస్తులు అమ్మటం, అప్పు చేయడం, పబ్జీ ఆడుకోవడం తప్పా జగన్ రెడ్డికి ఏమీ చేతకాదని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి.అత్తింటికి తీసుకెళ్తానని చెప్పి.. కుమార్తెపై అత్యాచారం చేశాడు!