ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్కడ హైకోర్టు బెంచ్​లు.. కర్నూలులో న్యాయ రాజధాని ఎలా..?'

రాజధాని వికేద్రికరణపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. న్యాయ రాజధాని పేరుతో సీమకు మరింత నష్టం చేసేందుకు ప్రభుత్వం కక్ష కట్టిందని ధ్వజమెత్తారు. లిప్ట్​ ఇరిగేషన్​ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రయత్నిస్తుంటే వైకాపా నేతలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అక్కడ హైకోర్టు బెంచ్​లు.. కర్నూలులో న్యాయ రాజధాని ఎలా..?'
'అక్కడ హైకోర్టు బెంచ్​లు.. కర్నూలులో న్యాయ రాజధాని ఎలా..?'

By

Published : Aug 7, 2020, 2:03 AM IST

విశాఖ, విజయవాడకు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటుకు ప్రతిపాదించిన జగన్‌ సర్కారు... కర్నూలును ఏ విధంగా న్యాయ రాజధానిగా చెబుతుందని తెదేపా నేత అఖిలప్రియ దుయ్యబట్టారు. 3 రాజధానుల నిర్ణయంతో రాయలసీమ ప్రజలే ఎక్కువగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్డుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వైకాపా నేతలు ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు.

దీనిపై కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అందరం పోరాడాలని అఖిలప్రియ పిలుపునిచ్చారు. రాయలసీమను కాపాడుకునేందుకు అంతా కలసి రావాలన్నారు. ప్రభుత్వం రాయలసీమలో ప్రాజెక్టులన్నీ ఆపేయటంతో పాటు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకుండా తీరని ద్రోహం చేస్తోందని ఆమె ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details