జీవో 35ని రద్దు చేయడం ద్వారా ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. విజయవాడలోని మాంటిస్సోరి జూనియర్ కళాశాలలో ఆ సంఘం సభ్యులు సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల వారికి ఆరోగ్య కార్డులు ఇస్తున్నట్లే ఎయిడెడ్ ఉద్యోగులకు ఇవ్వాలని.... సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ నగదు ఏ ఖాతాకు వెళ్తుందో తెలియడం లేదన్నారు. అసలు పింఛను చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
'జీవో 35ని రద్దు చేయాలని ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకుల డిమాండ్' - ajcea general body meetibg news in vijayawada
జీవో 35ని రద్దు చేయడం ద్వారా ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అన్ని వర్గాల వారికి ఆరోగ్య కార్డులు ఇస్తున్నట్లే ఎయిడెడ్ ఉద్యోగులకు ఇవ్వాలని ఆ సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ajcea general body meeting in vijayawada
తమకు ఆరోగ్య శ్రీ కార్డులివ్వాలని ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకుల వినతి