''పరిహారం వెంటనే చెల్లించాలి'' - గన్నవరం విమానాశ్రయం
గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములకు పరిహారం తక్షణమే చెల్లించాలని ప్లాట్ల యాజమానులు, రైతులు ధర్మపోరాట దీక్ష చేపట్టారు.
''పరిహారం వెంటనే చెల్లించాలి''
గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములకు పరిహారం తక్షణమే చెల్లించాలని ప్లాట్ల యాజమానులు, రైతులు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ప్రభుత్వ భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం కలగటం లేదని వారు అగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు స్టాంప్ డ్యూటీ మినహాయించాలని కోరిన... ప్రభుత్వం స్పందించ లేదన్నారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.